వన్డే ప్రపంచకప్ గ్లోబల్ అంబాసిడర్‌గా సచిన్..

World Cup : సచిన్ టెండూల్కర్‌కి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచకప్ టోర్నీకి సచిన్‌ని గ్లోబల్ అంబాసిడర్‌గా ఐసిసి నియమించింది. మరో రెండు రోజుల్లో (అక్టోబర్ 5) వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్‌కప్‌నకు సచిన్ టెండూల్కర్‌ని గ్లోబల్ అంబాసిడర్‌గా ఐసిసి నియమించింది. ఈ మ్యాచ్‌కు సచిన్ అంబాసిడర్ హోదాలో ప్రపంచకప్ ట్రోఫీతో మైదానంలో వస్తాడు. అక్టోబర్ 5వ తేదీన అహ్మదాబాద్ వేదికగా ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానుంది. మొదటిగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్టుల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.