నేతలు పార్టీలు మారడంపై మాజీ ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్ (CLiC2NEWS): నేతలు భుజం మీద కండువా మార్చినంత సులభంగా పార్టీలు మారుతున్నారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నగరంలోని ఎంసిఆర్ హెచ్ ఆర్‌డిలో సిజిజన్ యూత్ పార్టమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడుడ హాజరయ్యారు. ప్రస్తుత రాజకీయాల్లో రూ. కోట్లు లేనిదే ఓట్లు రావనే పరిస్థితి నెలకొన్నదని.. మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావల్సిన అవసరం ఉందని.. సిద్దాంతాలకు కట్టుబడి చేసే రాజకీయాల వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. యువత రాజకీయాల్లోకి రావలంటే.. బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదన్ఆరు. కానీ దానిలో రాణించేందుకు అధ్యయనం చేయాలని.. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయాలని చెప్పారు.