కడప జిల్లాలో ఆటోని ఢీకొన్న ఆర్‌టిసి బస్సు.. నలుగురు దర్మరణం

కడప (CLiC2NEWS): జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కడప ఆజాద్ నగర్ నుండి వెళ్తున్న ఆటోను అర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మరణించినవారు మహమ్మద్, హసీనా, అమీనా, షాకీర్‌గా గుర్తించారు.