హైదారాబాద్‌లో కిలోలకొద్దీ బంగారం, వెండి పట్టివేత..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో పలుచోట్ల భారీ మొత్తంలో బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో సోమవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన విషయం విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలోని చందానగర్ పిఎస్ పరిధిలోని తరానడర్లో సుమారు 5.65 కిలోల బంగారం పోలీసులు పట్టుకున్నరు. మరోవైపు నిజాంకాలేజ్ పరిసరాల్లో గేట్ నంబర్ 1వద్ద.. 7 కిలోల బంగారం 300 కిలోల వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్ పరిధిలోని షేక్‌పేట నారాయణమ్మ కాలేజ్ మెయిన్ రోడ్డు వద్ద రూ. 30 లక్షలు నగదును అక్రమంగా తరలిస్తున్నారని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నగదును సీజ్ చేశారు.