పూరి జ‌గ‌న్నాథ్ ఆల‌యంలో డ్రెస్‌కోడ్ అమ‌లు.. ఎప్ప‌టినుండంటే..

భువ‌నేశ్వ‌ర్‌ (CLiC2NEWS): పూరి జ‌గ‌న్నాథ ఆల‌యంలో భ‌క్తుల‌కు డ్రెస్ కోడ్ త‌ప్ప‌నిస‌రి చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 1వ‌తేదీ నుండి ఈ డ్రెస్ కోడ్ విధానాన్ని అమ‌లు చేయ‌నున్నట్లు నిర్ణ‌యించారు. ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తులు వ‌స్త్ర‌ధార‌ణ విష‌యంలో మార్పులు తీసుకురావాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు టెంపుల్ అడ్మినిస్ట్రేష‌న్ చీఫ్ వెల్ల‌డించారు. ఆయ‌న మాట్లాడుతూ.. జీన్స్‌లు,, స్లీవ్ లెస్ టాప్‌లు, హాప్ ప్యాంట్స్ ధ‌రించి బీచ్‌కు వెళుతున్న‌ట్లు ఆల‌యానికి వ‌స్తున్నార‌ని.. మ‌త‌ప‌ర‌మైన మ‌నోభావాల‌ను ప‌ట్టించుకోవ‌డంలేద‌న్నారు. 2024 జ‌న‌వ‌రి 1 నుండి సంప్రదాయ వ‌స్త్రాల‌ను ధ‌రించిన భ‌క్తుల‌ను మాత్న‌మే ఆల‌యంలోకి అనుమ‌తించనున్న‌ట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.