ఉత్తరాఖండ్ లోని పార్వతీకుండ్ లో పర్యటించిన ప్రధాని మోడీ

ఫిథోర్ గఢ్ (CLiC2NEWS): ఉత్తరఖండ్‌లో గురువారం ప్రధాని మోడీ పర్యటించారు. ఇవాళ అక్కడ ప్రధాని బిజీబిజీగా గడిపారు. ఇవాళ ఉదయం ఫిథోర్‌గఢ్ కే చేరున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆది కైలస పర్వత శిఖరాన్ని సందర్శించి అక్కడి ఆలయాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ప్రాంతంలోని పార్వతీకుండ్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటన ప్రధాని మోడీ ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించారు. కాగా సంప్రదాయ దుస్తులతో తన ప్రత్యేకతను మరో సారి చాటారు.