తమిళనాడులోని బాణసంచా కర్మాగారంలో పేలడు.. 11 మంది మృతి

చెన్నై (CLiC2NEWS): బాణసంచా కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మిదిమంది మహిళలే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. రంగపాళ్యం, కిచ్చనాయకన్ పట్టి గ్రామాల్లో వేర్వేరుగా పేలుడు సంభవించింది. పటాకులు, అగ్గిపెట్టెల తయారీ కేంద్రాలకు ప్రసిద్ధి గాంచిన శివకాశిలో శాంపిళ్లను పరీక్షిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేసే కార్మికులు 11 మంది మృతిచెందగా.. మరి కొంతమంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న సిఎం స్టాలిన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.