బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం..

పుణె (CLiC2NEWS): వరల్డ్‌కప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. టీమ్ ఇండియా బ్యాటర్లు కోహ్లీ 103* సెంచరీ చేయగా.. శుభ్‌మన్ గిల్ 53 హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ 48, కెఎల్ రాహుల్ 34, శ్రేయస్ అయ్యర్ 19 పరుగులు చేశారు.