Namo Bharat: పట్టాలెక్కిన తొలి రాపిడ్ ఎక్స్ రైలు..

గాజియాబాద్ (CLiC2NEWS): గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే దీశీయ తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు పట్టాలెక్కింది. ఉత్తర ప్రదేశ్‌లోని సాషిబాబాద్ స్టేషన్లో తొలి నమో భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మోడీ రైలులో ప్రయాణించారు. ముందుగా ఢిల్లీ-గాజియాబాద్-మేరఠ్ రీజినల్ రాపిడ్ ట్రిన్సిట్ సిస్టమ్ కారిడార్‌ను ప్రారంభించారు.
ఈ నమోభారత్ రైళ్లు ఉదయం 6గంటల నుండి రాత్రి 11 గంటల వరకు సేవలందించనున్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఒకటి నడుస్తుంది. ప్రతి రైలులో 6 కోచ్‌లుంటాయి. ప్రామాణిక కోచ్లలో 72.. ప్రీమియం తరగతిలో 62 సీట్లు ఉంటాయి. రైళ్లో అన్నీ ఎసి భోగీలే ఉంటాయి. ప్రతి రైలులో 2+2 తరహాలో సీట్లు ఉంటాయి. నిల్చునేందుకు విశాలమైన ప్రదేశం, సామాన్లు ఉంచేందుకు అరలు, సిసిటివి కెమెరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, లాప్టాప్ మోబైల్ ఛార్జింగ్ పాయింట్లు, రూట్ మాప్‌లు, ఆటోమెటిక్ లైటింగ్ సిస్టమ్ ఉన్నాయి.