ఇక శ్రీ‌లంక‌కు వీసా అక్క‌ర్లేదు..

శ్రీ‌లంక ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

కొలంబో (CLiC2NEWS): శ్రీ‌లంక స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకొంది. ఆ దేశానికి ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు ప‌ర్యాట‌క‌మే. ఈ మ‌ధ్య తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంక దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దానిలో భాగంగా ఇక‌పై శ్రీ‌లంక అందాల‌ను చూడాల‌నుకునే ప‌ర్యాట‌కు ఎలాంటి వీసా అక్క‌ర్లేద‌ని అక్క‌డి ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది ఈ మేర‌కు తాగా అక్క‌డి కేబినెట్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆ దేశ విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి అలీ స‌బ్రీ ప్ర‌క‌టించారు. ఈ వెసులు బాటు కేవ‌లం ఏడు దేశాల‌కు క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇది భార‌త్ స‌హా చైనా, ర‌ష్యా, మ‌లేసియా, జ‌పాన్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్ దేశాల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నిర్ణ‌యం త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌స్తుంద‌ని అలీ స‌బ్రీ వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.