అఫ్ఘాన్ విజ‌యంతో పాక్ సెమీస్ ఆశ‌లు సంక్లిష్టం!

చెన్నై (CLiC2NEWS): ఇండియాలో జ‌రుగుతున్న ఐసిసి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఎన్నో సంచ‌ల‌నాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఇంగ్లాండ్‌ను మ‌ట్టిక‌రిపించిన అఫ్ఘానిస్థాన్ జ‌ట్టు తాజా గా పాకిస్థాన్ కు షాకిచ్చింది. అఫ్ఘాన్ పంజా దెబ్బ‌కు పాక్ జ‌ట్టు ఓట‌మి చ‌విచూడ‌క త‌ప్ప‌లేదు. దీంతో పాక్ సెమీస్ ఆశ‌లు సంక్లిష్టంగా మారిన‌ట్లు క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.
చెన్నైలో పాక్ వ‌ర్సెస్ అఫ్ఘాన్ మ్యాచ్‌లో అండ‌ర్ ఎక్స్‌పెక్టేష‌న్‌తో వ‌చ్చిన అఫ్ఘానిస్థాన్ సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసింది. ఏకంకా పాక్‌పై 8 వికెట్ల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జ‌ట్టు 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 282 ప‌రుగుల స్కోరు న‌మోదు చేసింది. ఈ భారీ స్కోర్ అఫ్ఘాన్ బ్యాట‌ర్ల‌కు అంద‌రూ క‌ష్ట‌మే అనుకున్నారు. పాక్ బౌలింగ్‌ను త‌ట్టుకొని నిల‌బ‌డి ఈ భారీ స్కోర్ చేయ‌దేమోన‌ని అంద‌రూ అచ‌నా వేశారు. కానీ అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తే ఒక ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే విజ‌యాన్ని ముద్దాడింది అఫ్ఘాన్ జ‌ట్టు. కేవ‌లం రెండు వికెట్లు కోల్పోయి విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ విజ‌యంతో పాక్ సెమీస్ వెళ్లాలంటే మిగ‌తా నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గితేనే సెమీస్ చేరే అవ‌కాశం ఉంద‌ని క్రికెట్ పండితులు అంచ‌నా వేస్తున్నారు.

కాగా ఈ మ్యాచ్‌లో అఫ్ఘాన్ ఓపెన‌ర్లు ర‌హ్మ‌నుల్లా 65 ప‌రుగులు చేయ‌గా ఇబ్ర‌హీం 87 ప‌రుగుల మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ బ‌ల‌మైన ఓపెనింగ్ పునాదితో మొద‌టి వికెట్‌కు 130 ప‌రుగు భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేసారు. అనంత‌రం వ‌చ్చిన ర‌హ్మాత్ షా 84 ప‌రుగులు చేశాడు. హిష్మాతుల్లా 48 ప‌రుగులు చేసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

పాకిస్థాన్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ బాబ‌ర్ 74 ప‌రుగులు చేశాడు. అబ్దుల్లా 58 ప‌రుగులతో రాణించాడు. చివ‌ర్లో షాదాబ్ ఖాన్ 40 ప‌రుగుల‌తో మెరుపులు మెరిపించాడు.

Leave A Reply

Your email address will not be published.