త‌మిళ‌నాడులో రోడ్డు ప్ర‌మాదం.. 7 గురు మృతి

చెన్నై(CLiC2NEWS): త‌మినాట ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదం సంగం-కృష్ణ‌గిరి హైవేపై మంగ‌ళ‌వారం జ‌రిగింది. టాటా సుమో- బ‌స్సు బ‌లంగా ఢీ కొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు ప్ర‌మాదం స్థ‌లంలోనే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 14 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లికి చేరుకుని గాయ‌ప‌డిన వారికి హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుప‌త్రికి త‌ర‌లించారు. తిరువ‌న్న‌మ‌లై నుంచి బెంగళూరుకు టాటా స‌మో వెళ్తుండ‌గా బ‌స్సును ఢీ కొన‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో సుమోలో 10 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. వీరిలో ఏడుగురు చ‌నిపోగా మిగ‌తా వారు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అలాగే బ‌స్సులో ఉన్న ప్ర‌యాణికుల్లో దాదాపు 10 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రులంద‌రిని సెంగం ప్ర‌భుత్వాసుప్ర‌తికి చికిత్స కోసం త‌ర‌లించిన‌ట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.