వాషింగ్‌మెషిన్‌లో రూ. 1.30 కోట్లు.. వైజాగ్‌లో స్వాధీనం చేసుకున్న పోలీసులు

విశాఖపట్నం (CLiC2NEWS): ఆటోలో వాషింగ్ మిషన్‌లో నగదు ఉంచి తరలిస్తున్న రూ. 1.30 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు తరలిస్తుండగా విశాఖ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ నగదు ఓ ఎలక్ట్రానిక్ షాక్‌కు సంబంధించినదిగా పోలీసులు గుర్తించారు. వైజాగ్‌లోని ఎయిర్‌పోర్టు ప్రాంతంలో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో ఈ నగదును పోలీసులు గుర్తించారు. కాగా ఈ నగదుకు సంబంధించిన ఎలాంటి రసీదులు చూపించకపోవరడంతో సిఆర్ పిసి సెక్షన్ 41, 102 కింద పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.