Eluru: పిజిటి పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ ఆహ్వానం..

ఏలూరు (CLiC2NEWS): జిల్లాలోని హైస్కూల్ ప్ల‌స్ పాఠ‌శాల‌ల్లో పిజిటి పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతున్నారు. ఈ మేర‌కు జిల్లా విద్యాశాఖాధికారి పి.శ్యామ్ సుంద‌ర్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

జిల్లాలోని కామ‌వ‌ర‌పు కోట‌, టి న‌ర‌సాపురం పాఠ‌శాల‌ల్లో ఫిజిక్స్,
నిడ‌మ‌ర్రు, కానూరు జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌ల్లో సివిక్స్‌
సిద్దాంతం జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో కామ‌ర్స్
జిలుగుమిల్లి, కామ‌వ‌ర‌పు కోట‌, ధ‌ర్మాజి గూడెం, గూటాల‌, టి న‌ర‌సాపురం జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ల్లో కెమిస్ట్రి పిజిటి పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆస‌క్తి, అర్హ‌త‌ క‌లిగిన ఉపాధ్యాయులు న‌వంబ‌ర్ 2వ తేదీ మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌లోపు ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్‌ల‌తో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాల‌యంలో హాజ‌రుకావాల్సి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.