తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటికి టిడిపి దూరం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జైలులో శ‌నివారం తెలంగాణ టిడిపి అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ చంద్ర‌బాబును ములాఖ‌త్ సంద‌ర్బంగా క‌లిశారు. ఎపిలోని ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో తెలంగాణ‌పై దృష్టి పెట్ట‌లేమ‌ని చంద్ర‌బాబు అన్నారు. ఎటువంటి ప‌రిస్థితుల వ‌ల్ల ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్న విష‌యం తెలంగాణ నేత‌ల‌కు వివ‌రించాల‌ని చంద్ర‌బాబు కాసానికి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.