ఎంపిపై కత్తితోదాడి!

సిద్దిపేట (CLiC2NEWS): భారత్ రాష్ట్ర సమితి ఎంపి, ఆ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకరరెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఇంటింటిప్రచారం నిర్వహిస్తుండగా ఎంపి ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది. సూరంపల్లిలో ఎంపి ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈక్రమంలో పాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వస్తుండగా దాడి జరిగింది. కరాచలనం చేసేందుకు వచ్చిన దట్టని రాజు అనే వ్యక్తి ఉన్నట్టుండి తన వెంట తెచ్చిన కత్తితో ఎంపిపై దాడి చేశాడు. ఈ
దాడిలో ఎంపి పొట్ట పై భాగంలో గాయాలయ్యాయి. వెంటనే కార్యకర్తలు ఎంపిని గజ్వేట్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడికి బిఆర్ ఎస్ కార్యకర్తలు దేహశుద్ది చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మిరుదొడ్డి మండలం పెద్దప్యాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
కాగా ప్రభాకర్ రెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.