మ‌హారాష్ట్రలో ఎమ్మెల్యే ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళ‌న‌కారులు..

 

ముంబ‌యి మ‌హారాష్ట్రలో విద్యాసంస్థ‌లు, ఉద్యోగాల‌లో మ‌రాఠా వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రెండో రోజు ఆందోళ‌న‌లు నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ సోలంకే వివాసంపై దాడి చేసి నిప్పు పెట్టారు. దీంతో ఇల్లు మొత్తం ద‌గ్ధ‌మైంది. ఈ ఘ‌ట‌న స‌మ‌యంలో ఎమ్మెల్యే వారి కుటుంబ స‌భ్యులు ఇంట్లోనే ఉన్న‌ట్లు స‌మాచారం. ఎలాంటి గాయాలు లేకుండా త‌న‌తోపాటు కుటుంబ స‌భ్యులు, సిబ్బంది క్షేమంగా బ‌య‌ట‌ప‌డిన‌ట్లు ఎమ్మెల్యే తెలిపారు.

మ‌హార‌ష్ట్రలో మ‌రాఠా వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ అక్టోబ‌ర్ 25న జాల్నా జిల్లాలోని అంత‌ర్వాలీ సారథి గ్రామంలో సామాజిక కార్య‌క‌ర్త మ‌నోన్ జ‌రంగే పాటిల్ ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టారు. ఏ రాజ‌కీయ పార్టీని గ్రామంలోకి రానివ్వ‌ద్ద‌ని పాటిల్ గ్రామ‌స్థుల‌ను కోరారు. అత‌ని మాట ప్ర‌కారమే గ్రామ‌స్థులు ఎవ్వ‌రినీ రానివ్వ‌డం లేదు. వైద్య ప‌రీక్ష‌లు చేసేందుకు కూడా ఆయ‌న నిరాక‌రించారు. ఈ క్ర‌మంలో ఆందోళ‌న‌లు ఒక్క‌సారిగా తీవ్ర‌రూపం దాల్చిన‌ట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.