విజ‌య‌న‌గ‌రం రైలు ప్ర‌మాద ఘ‌ట‌న: 14 మంది మృతి

ఎపికి చెందిన బాధిత కుటుంబాల‌కు రూ 10ల‌క్ష‌లు..

విజ‌య‌న‌గ‌రం (CLiC2NEWS): జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్న ఘ‌ట‌న‌లో 14 మంది మృతి చెందిన‌ట్లు అధికారులు తెలిపారు. 54 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. బాధితుల‌కు ఆస్ప‌త్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి వెల్ల‌డించారు. మృతి చెంద‌ని వారిలో ఇప్ప‌టి వ‌ర‌కు 11 మంది వివ‌రాలు తెలిసిన‌ట్లు అధికారులు తెలిపారు.

ప‌ట్టాల‌పై నుండి పైకి లేచిన బోగి

కొత్త‌వ‌ల‌స మండ‌లం కంట‌కాప‌ల్లి-ఆల‌మండ మ‌ధ్య ఆదివారం రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యంలో సిగ్న‌ల్ లేక‌పోవ‌డంతో రెండు విశాఖ ప‌ట్నం-ప‌లాస రైలును రాయ‌గ‌డ రైలు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో రాయ‌గ‌డ రైల్లోని బోగీలు నుజ్జునుజ్జ‌య్యాయి. 3 బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. దీంతో 100 మందికి పైగా గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు అధికారులు తెలుపుతున్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో విద్యుత్ తీగ‌లు తెగిపోవ‌డంతో అంతా స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం ఏర్ప‌డింది. ఈ రెండు రైళ్ల‌లో క‌లిపి సుమారు 1400 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు స‌మాచారం.

మృతుల కుటుంబాల‌కు కేంద్రం రూ. 2ల‌క్ష‌లు, క్ష‌త‌గాత్రుల‌కు రూ. 50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించింది.

ఎపి ముఖ్య‌మంత్రి సిఎం జ‌గ‌న్ మృతుల‌ కుటుంబాల‌కు రూ. 10ల‌క్ష‌లు.. క్ష‌త‌గాత్రుల‌కు రూ.2 ల‌క్ష‌లు ప‌రిహారం ప్ర‌క‌టించారు.

Vijayanagaram: రెండు రైళ్లు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి

Leave A Reply

Your email address will not be published.