High Court: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు..

అమరావతి (CLiC2NEWS): టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 9వ తేదీన సిఐడి అరెస్టు చేసింది. ఆయనకు ఎసిబి కోర్టు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. 52 రోజులుగా జైల్లో ఉన్న ఆయనకు నేడు ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎసిబి కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.
ఆనారోగ్య కారణాల రీత్యా చికిత్స నిమిత్తం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ.. నేడు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లి కార్జునారావు తీర్పు వెల్లడించారు. నవంబర్ 10 న రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది.