కౌలు రైతుల‌కూ రైతు భ‌రోసా.. రాహుల్‌గాంధీ

కొల్లాపూర్ (CLiC2NEWS): ఆరు గ్యారెంటీలు అమ‌లు కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇందిర‌మ్మ రాజ్యం రావాల‌ని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. కొల్లాపూర్‌లో నిర్వ‌హించిన పాల‌మూరు ప్ర‌జాభేరి స‌భ‌లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దొర‌ల తెలంగాణ మ‌ధ్య ఈ ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్నాయ‌ని.. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే రైతుబంధు నిలిపోతుంద‌ని బిఆర్ ఎస్ ఆరోపిస్తుంద‌న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. రైతుల‌కే కాదు.. కౌలు రైతుల‌కు కూడా రైతు భ‌రోసా కింద రూ. 15 వేలు అందిస్తామ‌న్నారు. ఉపాధి హామీ కూలీల‌కు కూడా రూ. 12 వేలు ఇచ్చి ఆదుకుంటుంద‌న్నారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో రూ. ల‌క్ష కోట్ల అవినీతి జ‌రిగింద‌ని, తెలంగాణ ప్ర‌జ‌ల సొమ్ము దోపిడి జ‌రిగింద‌ని రాహుల్ ఆరోపించారు. దొర‌ల తెలంగాణ‌లో ఏం జ‌రుగుతుందో ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.