వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.100 పెంపు..
ఢిల్లీ (CLiC2NEWS): మూడు నెలల్లోనే మరో సారి ధర పెరిగిన వంటగ్యాస్ సిలిండర్. 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ. 100 మేర పెరిగింది. అంతకుముందు అగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కలిపి రూ. 250 మేర ధర పెరిగింది. ఇపుడు తాజాగా రూ. 100 పెంచడంతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలెండర్ ధర రూ. 1,833కు చేరింది. చెన్నైలో రూ. 1999.50, కోల్‌కతాలో రూ. 1,943 , ముంబయిలో రూ. 1,785.50 కు చేరింది. ఈ ధరలు నేటి నుండే అమలులోకి రానున్నట్లు సమాచారం. గృహ వినియోగ సిలెండర్ ధర ఆగస్టు 30వ తేదీన రూ. 200 తగ్గించిన విషయం తెలిసిందే. దీని ధరలో మాత్రం మార్పులేదు.