27 మంది విశిష్ట ప్రతిభకు వైఎస్ఆర్ అవార్డుల ప్రధానం..
విజయవాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో 27 మందికి వైఎస్ ఆర్ అవార్డులను , గవర్నర్‌తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్‌లో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 23 మందకి లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, 4 ఎచీవ్‌మెంట్ అవార్డులను అందించారు. వ్యవసాయం, ఆర్ట్ అండ్ కల్చర్, క్రీడలు, వైద్యం, మీడియా, సమాజసేవ రంగాలలో సేవలందించిన వారు ఈ అవార్డులు అందుకున్నారు.
వీరికి వైఎస్ ఆర్ జీవిత సాఫల్యం కింద రూ. 10 లక్షలు.. వైఎస్ ఆర్ సాఫల్యం కింద రూ. 5 లక్షల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేస్తారు.