సంప‌ద పెంచాలి.. పేద‌ల‌కు పంచాలి: కెటిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS):  సంప‌ద పెంచాలి.. పేద‌ల‌కు పంచాలి అనేది కెసిఆర్ సిద్ధాంత‌మ‌ని కెటిఆర్‌ బిఆర్ ఎస్ కార్యనిర్వ‌హ‌క అధ్య‌క్షుడు కెటిఆర్ అన్నారు.

తెలంగాణ‌లో పుట్టుక నుండి చివ‌రి దాకా చూసుకునేలా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. భార‌త రాష్ట్ర స‌మితి పాల‌న‌లో హైద‌రాబాద్ విశ్వ‌న‌గ‌రంగా ఎదిగింద‌ని.. న‌గ‌ర అభివృద్ధి అంద‌రికీ క‌నిపిస్తుంద‌న్నారు. హైద‌రాబాద్‌లో ఉంటే అమెరికాలో ఉన్న‌ట్లుంద‌ని ర‌జినీకాంత్ అన్న విష‌యం గుర్తుచేసుకున్నారు. కానీ విప‌క్షాల‌కు క‌నిపించట్లేద‌ని.. సంప‌ద అనేది పెంచి.. పేద‌ల‌కు పంచాల‌నేది కెసిఆర్ సిద్ధాంత‌మ‌ని కెటిఆర్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.