నేపాల్‌లో భూకంపం.. 143కి చేరిన మృతులు

కాఠ్మాండు (CLiC2NEWS): నేపాల్ లో శుక్రవారం రాత్రి 11.47 గంటలకు సంభవించిన భూకంపం పెను విషాదన్ని నింపింది. రిక్టర్‌స్కల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ విపత్తులో ఇప్పటి వరకు దాదాపు 143 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 150 మందికి పైగానే తీవ్రంగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
ఈ భూకంపం 11 మైళ్ల లోతులో నమోదైనట్లు అధికారులు గుర్తించారు. జజర్‌కోట్లో భూకంప కేంద్రం నమోదైనట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్ష, పరిశోధన కేంద్రం పేర్కొంది. ఈ విపత్తుతో రుకమ్ జిల్లాలో ఇళ్లు కూలిపోయి సుమారు 35 మంది, జజర్ కోట్‌లో 34 మంది మృతి చెందినట్లు స్థానకంగా ఉన్న అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం తర్వాత శనివారం తెల్లవారు జామున మరో నాలుగు సార్లు మళ్లీ ప్రకంపనలు సంభవించాయి. కాగా మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రధాని దుహాల్ ప్రచండ సంతాపం ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
[…] నేపాల్‌లో భూకంపం.. 143కి చేరిన మృతులు […]