ఢిల్లీలో అతి తీవ్ర స్థాయిలో గాలి నాణ్య‌త‌.. స్కూళ్ల‌కు సెల‌వులు పొడిగింపు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. గ‌త మూడు రోజులు గా అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. శ‌నివారం ఉద‌యం ఎక్యూ 504 కి చేరింది. జ‌హంగిర్‌పురి ఏరియాలో ఇది 702, సోనియా విహార్‌లో 618 తీవ్ర‌త‌ను తెలియ జేస్తుంది. ఇక్క‌డ విష‌వాయువుల గాఢ‌త 2.5 స్థాయిలోనే ఉంది. ఇది వ‌ర‌ల్డ్ ఆరోగ్య సంస్థ జారీ చేసిన ప్ర‌మాణాల‌కంటే 80 రెట్లు అధికం. ఈ వాయుకాలుష్యం మూలంగా ప్ర‌జ‌లు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నారు. దాంతో పాటు కంటి దుర‌ద‌, శ్వాస‌కోశ సంబంధిత రోగాల బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా ఢిల్లీలో కాలుష్య తీవ్ర‌త పెర‌గ‌డంతో ఆప్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకొంది. ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల‌కు మ‌రో 5 రోజులు సెల‌వుల‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గ‌తంలో న‌వంబ‌రు 5వ తేదీ వ‌ర‌కు ఇచ్చిన సెల‌వుల‌ను తాగాగా 10వ తేదీ వ‌ర‌కు పొడిగిందిచంది. 6 నుంచి ఆ పై త‌ర‌గుతుల వారికి య‌థావిధిగా క‌ల్లాసులు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని… ఆన్‌లైన్‌లో త‌ర‌గ‌తులు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని ఢిల్లీ విద్ఆయ శాఖ మంత్రి అతితి ఎలిపారు.
ఆదివారం ఢిల్లీలో వుయు నాణ్య‌త సూచి 486గా ఉంది. శ‌నివారం(504)తో పోలిస్తే స్వ‌ల్పంగా త‌గ్గింది.

Leave A Reply

Your email address will not be published.