BHARAT BRAND: కిలో గోధుమ పిండి రూ. 27.50కే..

ఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకే గోధుమ పిండి విక్రయాలను ప్రారంభించింది. కిలో గోధుమ పింది రూ. 27.50కే దేశవ్యాప్తంగా అందించాలనే ఉద్దేశ్యంతో విక్రయాలు చేపట్టారు. భారత్ బ్రాండ్ పేరిట కేంద్ర ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ప్రారంభించారు. గోధుమ పిండి కోసం భారత్ ఆహార సంస్థ నుండి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల గోధుములను కిలో రూ. 21.50కు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏజెన్సీలకు కేటాయించారు. ఇక్కడ తయారైన పిండిని దేశ వ్యాప్తంగా రూ. 27.50కు విక్రయించనున్నట్లు సమాచారం. దేశంలో మొత్తం 2వేల దుకాణాలకు 800 వాహనాలు భారత్ దాల్, గోధుమ పిండి, ఉల్లిపాలను సరఫరా చేస్తామని కేంద్ర పౌరసరఫరాల శాఖ తెలిపింది.