Delhi: అరెస్ట‌యినా.. మీరే మా సిఎం..

ఢిల్లీ (CLiC2NEWS): ఏదైనా కేసులో అరెస్ట‌యినా స‌రే.. ఢిల్లీ మా ముఖ్య‌మంత్రిగా కొన‌సాగాల‌ని అర‌వింద్ కేజ్రివాల్‌ను ఆప్ పార్టీ ఎమ్మెల్యేలంద‌రూ కోరిన‌ట్లు స‌మాచారం. ఢిల్లీ అసెంబ్లీ కాంప్లెక్స్‌లో సోమ‌వారం ఆప్ ఎమ్మెల్యేలంద‌రూ సమావేశ‌మ‌య్యారు. కేజ్రీవాల్‌కు ఇటీవ‌ల మ‌ద్యం పాల‌సీ కేసులో ఇడి స‌మ‌న్లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. విచార‌ణ‌కు ఆయ‌న గైర్హాజ‌రు అవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో కేజ్రీవాల్ అరెస్టుపై ఊహాగానాలు రావ‌డం.. ఇంకా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు త‌మ‌ పార్టీ మంత్రులు, నేత‌ల‌పై వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు నేప‌థ్యంలో పార్టీ ఎమ్మెల్యంతా అత్య‌వ‌స‌రంగా భేటీ అయ్యారు. స‌మావేశానంత‌రం ఢిల్లీ మంత్రి సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ ఒక‌వేళ అరెస్ట‌యితే.. ఢిల్లీ ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు మేర‌కు ఆయ‌నే సిఎంగా కొన‌సాగాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.