ఐదేళ్లపాటు ఉచిత రేషన్: ప్రధాని మోడీ
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఎల్బి స్టేడియంలో నిర్వహించిన బిజెపి బిసి ఆత్మగౌరవ సభకు ప్రధాన మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుణ్యభూమి తెలంగాణకు ప్రణామాలు అంటూ ప్రారంభించారు. బిసి ఆత్మ గౌరవ సభలో పాల్గొనటం నాఅదృష్టం. మీ ఆశీర్వాదంతోనే నేను ప్రధాని అయ్యానన్నారు. ఇపుడు మీ ఆశీర్వాదంతోనే బిసి వ్యక్తి తెలంగాణ సిఎం అవుతారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు.
బిసిలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది బిజెపి అని.. అబ్దుల్ కలామ్‌ను.. వాజ్‌పేయీ రాష్ట్రపతిని చేశారని ఈ సందర్భంగా మోడీ గుర్తుచేశారు. పిఎ సంగ్మా, బాలయోగిని స్పీకర్ చేసిందని.. రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి చేసిందని.. గిరిజన మహిళ ద్రౌపదిముర్మును రాష్ట్రపతి చేసింది బిజెపినేనని అన్నారు. అవినీతి సర్కారును ఇంటికి పంపడం ఖాయమని.. తెలంగాణలో బిజెపి సర్కారు ఏర్పడటం కూడా ఖాయమని ప్రధాని అన్నారు. పేదలకు ఐదేళ్లపాటు ఉచితంగా బియ్యం అందిస్తామని మోడీ ప్రకటించారు.