రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు.. ఒకరు మృతి
భోపాల్ (CLiC2NEWS): మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పుర్‌కు సమీపంలో మంత్రి ప్రహ్లాద్ పటేల్ కాన్వాయ్ రాంగ్ రూట్‌లో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఒకరు మృతి చెందగా.. మంత్రితో సహా ఆయన వ్యక్తిగత కార్యదర్శికి స్వల్పగాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్ ప్రయాణిస్తున్న వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.