సైనిక్ స్కూళ్ల‌ల్లో 6,9 త‌ర‌గ‌తుల ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం

ఢిల్లీ (CLiC2NEWS): దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక పాఠ‌శాల‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి ఆరు, తొమ్మిది త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్(AISSEE) 2024 ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వ‌హిస్తుంది. డిసెంబ‌ర్ 16వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు. నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ, ఇండియ‌న్ నేవీ అకాడ‌మీల‌కు ఇక్క‌డ శిక్ష‌ణ ఇస్తారు. పాఠ‌శాల విద్య నుండే త్రివిధ ద‌ళాలకు అవ‌స‌ర‌మైన అధికారుల‌ను సిద్దం చేసే ల‌క్ష్యంతో కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న 33 పాఠ‌శాల‌ల‌తో పాటు కొత్త‌గా 19 సైనిక పాఠ‌శాల‌ల‌ను వ‌చ్చే ఏడాది నుండి ఆరో త‌ర‌గ‌తిలో ప్ర‌వేశాలు క‌ల్పించానున్నారు. దేశ వ్యాప్తంగా 186 ప్ర‌దేశాల‌లో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఆరో త‌ర‌గ‌తిలో ప్ర‌వేశానికి మార్చి, 31, 2024 నాటికి 10 నుండి 12 ఏళ్ల మ‌ధ్యం ఉండాలి. తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు వ‌య‌స్సు 13 నుండి 15 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎనిమిద‌వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. ద‌ర‌ఖాస్తు రుసుం రూ. 650 గా నిర్ణ‌యించారు. ఎస్‌టి, ఎస్‌సిల‌కు రూ. 500 ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.