ఎన్నిక‌ల విధులు ముగించుకొని వెళుతున్న ముగ్గురు టీచ‌ర్లు మృతి

రాయ్‌పుర్‌ (CLiC2NEWS): ఎన్నిక‌ల విధులు ముగించుకొని వెళుతున్న ముగ్గురు ఉపాధ్యాయులు రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో తొలి విడ‌త ఎన్నిక‌ల పోలింగ్ మంగ‌ళ‌వారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కొండ‌గాన్ జిల్లా కేంద్రంలో ఇవిఎంలు అప్ప‌గించి తిరిగి వెళుతున్న క్ర‌మంలో బ‌మిగాన్ గ్రామం స‌మీపంలో టీచ‌ర్లు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ఓ ట్ర‌క్కును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు ఉపాధ్యాయులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా.. మ‌రొక‌రు తీవ్ర గాయాల‌తో అస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మొత్తం 90 స్థానాల‌కు గాను రెండు విడ‌త‌ల వారీగా పోలింగ్ నిర్వ‌హిస్తున్నారు. మంగ‌ళ‌వారం తొలి విడ‌త‌లో 20 స్థానాల‌కు ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. రెండో ద‌శ పోలింగ్ ఈ నెల 17న పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

Leave A Reply

Your email address will not be published.