స్పోర్ట్స్ కోటాలో తపాలా శాఖలో 1,899 ఉద్యోగాలు..
ఢిల్లీ (CLiC2NEWS): పోస్టల్ డిపార్ట్మెంట్లో 1,899 ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిద పోస్త్ సర్కిళ్లలో ఇంటర్, డిగ్రీ అర్హతతో స్పోర్ట్స్ కోటా కింద ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. రేపటి నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 598 పోస్టల్ అసిస్టెంట్, 143 సార్టింగ్ అసిస్టెంట్, 585 పోస్ట్‌మ్యాన్ , 3 మెయిల్గార్డ్, 570 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటిఎస్) పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు రుసుం రూ. 100గా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 18,000 నుండి 81,100 వరకు వేతనం ఉంటుంది. వయస్సు 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎపిలో పోస్టులు
పోస్టల్ అసిస్టెంట్ 27
సార్టింగ్ అసిస్టెంట్ 2
పోస్ట్‌మ్యాన్ 15
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటిఎస్) 17
తెలంగాణ
పోస్టల్ అసిస్టెంట్ 16
సార్టింగ్ అసిస్టెంట్ 5
పోస్ట్‌మ్యాన్ 20
మెయిల్ గార్డ్ 2
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటిఎస్) 16