సైనికులతో కలసి మోడీ దీపావళి వేడుకలు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దీపావళి పండుగను ప్రధాని సైనికులతో కలిసి జరుపుకున్నాడు. ఆదివారం హిమాచల్ ప్రదేశ్లోని లేప్చాలో జవాన్లతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా రక్షణ రంగంలో ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని అన్నారు. హిమాలయాలయాల్లా సరిహద్దుల్లో సైనికులు ధృడంగా ఉన్నంత వరకు దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. కుటుంబానికి దూరంగా ఈ దీపావళి రోజున కూడా ఈ సరిహద్దుల్లో విధులు నిర్వహించడం మీ నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు. భద్రతా బలగాలు పని చేస్తున్న చోటు నాకు దేవాలయంలతో సమానం అని ప్రధాని అన్నారు.