నిప్పంటించుకుని కుటంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..

కోన‌సీమ (CLiC2NEWS): ఆ కుటంబానికి ఏ ఇబ్బందులు ఎదుర‌య్యాయోకానీ భార్య‌భ‌ర్త‌లు, కుమారుడు నిప్పంటించ‌కుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నంకు పాల్ప‌డ్డారు. . ఈ ఘ‌ట‌న‌లో భార్య మంగాదేవి మృతి చెంద‌గా.. భ‌ర్త, కుమారుడు తీవ్ర‌గాయాల‌య్యాయి. కోన‌సీమ జిల్లా కొత్త‌పేట మండ‌లం అవిడి క‌ట్ట‌మ్మ కాల‌నీలో ఈ దారుణం చోటుచేసుకుంది. వెంట‌నే స్పందించిన స్థానికులు గాయాల‌తో ఉన్నవారిని ప్ర‌భుత్వ‌ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ క‌ల‌హాలే ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.