Kakinada: ట్రాక్టర్ని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు మృతి
ఒక బైక్పై నలుగురు.. అందులో ఓవర్ స్పీడ్..
కాకినాడ (CLiC2NEWS): జిల్లాలోని తాళ్లరేవు మండలం లచ్చావారిపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న బైక్ ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బైక్పై నలుగురు వ్యక్తులు ఉన్నారు. వీరందరూ పెయింటర్లని పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మరణించిన వారు రత్తవారి పేట వాసులుగా గుర్తించారు.