పాకిస్థాన్ కెప్టెన్ సంచలన నిర్ణయం..!
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజం కీలక నిర్ణయం తీసుకున్నాడు. మూడు ఫార్మట్ల క్రికెట్‌లో పాక్ కెప్టెన్సీకి ఆజం రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ మేరకు బాబార్ ఆజం ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశాడు. బాబర్ ఆజం 2019 నుండి పాక్ క్రికెట్ జట్టుకు సారథిగా సేవలందిస్తున్నాడు.
కెప్టెన్సీ నుండి తప్పుకున్నా.. మూడు ఫార్మాట్లలోనూ ప్లేయర్‌గా కొనసాగుతానని, ఈ నిర్ణయం తీసుకున్నందుకు బాధగాఉందని.. కానీ ఇదే సరైన సమయం అని భావించినట్లు తెలిపాడు. కొత్త కెప్టెన్ ఎవరొచ్చినా నావంతు సహకారం ఉంటుందని, ఈ సందర్భంగా బాబర్ తనకు అవకాశం ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు.
— Babar Azam (@babarazam258) November 15, 2023