ప్రమాదం ముంగిట్లో ఆ దేశాలు
మరోసారి హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
జెనీవా: కరోనా వైరస్ మహమ్మారి విషయంలో ప్రపంచం ప్రస్తుతం ఓ కీలక మలుపులో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కొన్ని దేశాలు ప్రమాదకర మార్గంలో ప్రయాణిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అన్నారు. ఆయా దేశాల ఆరోగ్య సేవల వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తరార్ధగోళంలో కిష్టమైన దశలో ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పటికే హాస్పిటళ్లు జనాలతో నిండిపోయాయని పేర్కొన్నారు. ఇంకా అక్టోబర్‌లోనే ఉన్నామని, రాబోయే కొద్ది నెలలు మరింత కఠినంగా ఉంటాయన్నారు. ప్రాణనష్టం పెరగకుండా తక్షణమే కఠిన చర్యలు తీసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
(తప్పకచదవండి:దేశంలో 70 లక్షలు దాటిన రికవరీలు)
విద్యాసంస్థలను మళ్లీ మూసివేయాల్సిందిగా ఆయా దేశాల నేతలను కోరారు. కరోనా కట్టడి కోసం ఆయా దేశాలు విచక్షణాయుతంగా చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరిలోనే చెప్పానని, మరోసారి చేస్తున్నట్లు పేర్కొన్నారు. చాలా దేశాలు ఇప్పుడు అంటువ్యాధుల పెరుగుదలను చూస్తున్నాయని టెడ్రోస్ తెలిపారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయడం ద్వారా గట్టెక్కవచ్చని ఆయన సూచించాడు.