రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలిసే పోటీ.. పురందేశ్వరి
నెల్లూరు (CLiC2NEWS): వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని బిజెపి ఎపి అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని గాలికివదిలేసి కక్షపూరిత రాజకీయాలతో కాలం గడుపుతోందని విమర్శించారు. ఎపిలో జరుగుతున్న అన్నికార్యక్రమాలకు కేంద్రమే నిధులిస్తోందని, వైఎస్ ఆర్ ప్రభుత్వం సొంతంగా చేస్తున్నది ఏదీలేదన్నారు. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై సోషల్మీడియాలో జోకులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించడం విపక్షాల హక్కు అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి, జనసేన కలిసే వెళతాయని పురందేశ్వరి అన్నారు.