హైద‌రాబాద్ న‌గ‌ర శివారులో 6 కార్ల‌లో రూ.6 కోట్లు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో నగ‌రంలో భారీగా న‌గ‌దు ప‌ట్టుబ‌డింది. న‌గ‌ర శివారులో ఓఆర్ ఆర్ అప్పా కూడ‌లి వద్ద శ‌నివారం పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టగా.. ఆరు కార్ల‌లో భారీగా న‌గ‌దును గుర్తించారు. వాటి మొత్తం దాదాపు రూ. 6 కోట్లు ఉంటుంది. స‌రైన ప‌త్రాలు లేక‌పోవ‌డంతో పోలీసులు న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.