భారత్ వరల్డ్‌కప్ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతానన్న ఆస్ట్రోటాక్ సిఇఒ!
ఆస్ట్రోటాక్ కంపెనీ సిఇఓ బంపర్ ఆఫర్
ఢిల్లీ (CLiC2NEWS): దేశ ప్రజలంతా టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నారు. రేపు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ కప్ అందుకోవాలని కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆస్ట్రోటాక్ కంపెనీ సిఇఒ భారత్ గెలవాలంటూ.. గెలిస్తే తమ కస్టమర్లకు రూ. 100 కోట్లు పంచుతానని’ ప్రకటించాడు. ఈ మేరకు ఆస్ట్రోటాక్ కంపెనీ సిఇఓ పునీత్ గుప్తా తన సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఆదివారం భారత్,ఆస్ట్రేలియా ఫైనల్ అహ్మదాబాద్‌లో జరగనున్న విషయం తెలిసిందే.
2011లో భారత్ వరల్డ్ కప్ గెలిచినపుడు తను కాలేజ్‌లో చదువుతున్నానని, అపుడు మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఎంతో టెన్షన్‌గా చూశామని గుర్తుచేసుకున్నారు. ప్రెండ్స్‌తో కలిసి ఆడిటోరియంలో మ్చాచ్ను వీక్షించినట్లు, టీమ్ ఇండియా గెలిచాక తమ ఆనందానికి అవధుల్లేవని, అపుడు నేను కొంతమంది స్నేహితులతో ఆనందాన్ని పంచుకున్నానని, కానీ ఇపుడు మా ఆస్ట్రోటాక్ యూజర్లంతా నా స్నేహితులేనన్నారు. వారందితో కలిసి ఆనందాన్ని పంచుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. భారత్ ప్రపంచకప్‌ను ముద్దాడితే మా సంస్థ యూజర్లందరికీ రూ. 100 కోట్లను సమానంగా పంచాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. భారత్ గెలవాలని ప్రార్థిద్దాం అంటూ పునీత్ ట్వీట్‌చేశారు.