రాజస్థాన్‌లో ప్రమాదానికి గురైన పోలీసు వాహనం.. ఆరుగురు మృతి
జైపుర్ (CLiC2NEWS): రాజస్థాన్‌లోని చురూ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న ట్రక్కును పోలీసు సిబ్బంది ప్రయాణిస్తున్న ఎస్‌యువి వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మోడీ ఎన్నికల ప్రచారంలో విధులు నిర్వహించేందుకు వెళుతున్నట్లు సమాచారం. నాగౌర్ పోలీసు స్టేషన్‌ల పనిచేసే ఏడుగురు పోలీసు సిబ్బంది ఎస్‌యువి వాహనంలో ఝున్‌ఝునులో నిర్వహించే మోడీ సభకు బయలుదేరారు. ఈ క్రమంలో దారంతా దట్టమైన పొగమంచు నిండి ఉండటంతో ముందున్న ట్రక్కు కనపడక పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల వాహనం పూర్తిగా దెబ్బతింది. దీంతో వాహనంలో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో ఆరుగరు పోలీసులు మృతి చెందారు.