AP: రేపు రాష్ట్ర విభజన అంశాలపై కీలక సమావేశం
అమరావతి (CLiC2NEWS): రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సోమవారం విభజన అంశాలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కీలక సమావేశం జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో విభజన హామీలు , 13వ షెడ్యూల్ లోని అంశాలపై చర్చించనట్లు తెలుస్తోంది.
రేపు సమావేశంలో ఏయే అంశలు చర్చించాలనే దాని గురించి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. విభజన కారణంగా ఎపికి తీవ్ర నష్టం జరిగిందని, పదేళ్లు దాటుదున్న చట్టంలోని అంశాలు పరిష్కరించలేదన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధుల హామీ ఇంకా నెరవేరలేదని, తెలంగాణ నుండి ఎపికి రావల్సిన విద్యుత్ బాకాయిలు ఇంకా రాలేదని సిఎం తెలిపారు. రైల్వేజోన్, విశాఖ మెట్రోపై మంగళవారం సమావేశంలో చర్చించాలని అధికారులకు సిఎం సూచించారు.