చింత‌మ‌డ‌క‌లో ఓటు వేసిన సిఎం కెసిఆర్‌

సిద్దిపేట (CLiC2NEWS): తెలంగాణ ముఖ్య‌మంత్రి, భార‌త్ రాష్ట్ర స‌మితి అధినేత కె. చంద్ర‌శేఖ‌ర‌రావు త‌న స‌తీమ‌ణి శోభ‌తో క‌లిసి సిద్దిపేట జిల్లా చింత‌మ‌డ‌క‌లో ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.
ఇవాళ చింత‌మ‌డ‌క‌కు చేరుకున్న సిఎం అక్కడి పోలింగ్ కేంద్రంలో ఓటు ను వేశారు. అనంత‌రం ఓట‌ర్ల‌కు , అభిమానుల‌కు అభివాదం చేస్తూ సిఎం వెళ్లిపోయారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ఇవాళ ఉద‌యం ప్రారంభ‌మైన పోలింగ్ మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు 36.68 శాతం న‌మోదైన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు తెలిపారు. అత్య‌ధికంగా మెద‌క్ జిల్లాలో 50.80 శాతం, అత్య‌ల్పంగా హైద‌రాబాద్‌లో 20.79 శాతం పోలింగ్ న‌మోదైంది.

Leave A Reply

Your email address will not be published.