స‌లార్ పార్ట్‌-1 ట్రైల‌ర్ రిలీజ్‌..

Salaar Trailer (CLiC2NEWS): ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్ప‌ చిత్రం స‌లార్. సినీ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న‌ప్ప‌టికీ ఈ చిత్రం వాయిదాప‌డుతూ వ‌చ్చింది. ఈ నెల 22వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర‌బృందం తాజాగా స‌లార్ పార్ట్ 1 – సీజ్‌ఫైర్ ట్రైల‌ర్‌ను విడుద‌ల‌చేసింది. 3 నిమిషాల 47 సెక‌న్ల నిడివి ఉన్న ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిని రేకిత్తిస్తోంది. ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడుగా మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌భాస్, పృథ్వీరాజ్‌ల చిన్న‌నాటి స్నేహానికి సంబంధించిన స‌న్నివేశాల‌తో ట్రైల‌ర్ సాగుతుంది. బాలివుడ్ ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు టీనూ ఆనంద్‌, జ‌గ‌ప‌తిబాబు, ఈశ్వ‌రీరావు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.