ఫలితాలపై మంత్రి కెటిఆర్ స్పందన…

హైదరాబాద్ (CLiC2NEWS): భిఆర్ ఎస్ కు వరుసగా రెండు సార్లు అధికారాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ఫలితం గురించి బాధలేదని పేర్కొన్నారు. కానీ ఈ ఫలితం మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందానని పేర్కొన్నారు. ఈ ఫలితాలన్ని మేమొక పాఠంగా తీసుకొని, తిరిగి పుంజుకుంటాం. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు మంత్రి కెటిఆర్. వారికి శుభం జరగాలి అని కోరారు.