మూడు రాష్ట్రాల్లో క‌మ‌ల వికాసం..

ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో జ‌రిగిన ఐదు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నాలుగు రాష్ట్రాల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. తెలంగాణ‌లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకోగా.. రాజ‌స్థాన్ , మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ మూడు రాష్ట్రాల్లో బిజెపి విజ‌య ప‌తాకం ఎగుర‌వేసింది. రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి బిజెపి అధికారాన్ని చేజిక్కించుకుంది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్

ఈ రాష్ట్రంలో 230 స్థానాల‌కు జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 153 స్థానాలు బిజెపి కైవ‌సం చేసుకుంది. మ‌రో 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

రాజ‌స్థాన్ 

ఈ రాష్ట్రంలో అధికార పార్టీని వెనుక‌కు నెట్టి బిజెపి 101 స్థానాల్లో విజ‌యం సాధించింది. రాష్ట్రం మొత్తంలో 200 సీట్ల‌కు 199 స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించారు. కాంగ్రెస్ 61 స్థానాల్లో గెలుపు సొంతం చేసుకుంది. మ‌రో 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌
రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డానికి 46 సీట్లు కావాలి. ఇక్క‌డ బిజెపి 52చోట్ల గెలిచిఉంది.

Leave A Reply

Your email address will not be published.