రాజ్‌భ‌వ‌న్‌కు బ‌య‌లుదేరిన‌ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ముగింపుకు చేరుకుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల‌కు.. 64 స్థానాలు హ‌స్త‌గ‌త‌మ‌య్యాయి. 37 స్థానాల్లో బిఆర్ ఎస్ గెలుపొందింది. మ‌రో రెండు స్థానాలకు ఓట్ల లెక్కింపు కొన‌సాగుతుంది. మెజారిటీ సీట్లు పొందిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంది. తెలంగాణ నూత‌న సిఎంగా సోమ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేసేది ఎవ‌ర‌నేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండ‌గా రేవంత్ రెడ్డి సార‌థ్యంలో గెలిచిన ఎమ్మెల్యే అభ్య‌ర్థులు క‌లిసి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌ను క‌ల‌వనున్నట్ల స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.