TS: తొలి మంత్రివ‌ర్గ స‌మావేశం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో నూత‌న ప్ర‌భుత్వం ఏర్ప‌డిన అనంత‌రం తొలి మంత్రివ‌ర్గం స‌మావేశం జ‌రిగింది. స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్ష‌త‌న నూత‌నంగా ఎంపికైన మంత్రుల‌తో తొలి కేబినేట్ మీటింగ్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఆరు గ్యారంటీల అమ‌లు, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మంత్రివ‌ర్గం చ‌ర్చించింది. ఈ స‌మావేశంలో సిఎస్ శాంతి కుమారి, వివిద శాఖ‌ల కార్య‌ద‌ర్శులు పాల్గొన్నారు.

స‌మావేశంలో నిర్ణ‌యించిన అంశాల‌ను  ఆర్ధిక శాఖ‌ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు మీడియాతో మాట్లాడుతూ..
రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ. 10 లక్ష‌ల వ‌ర‌కు పొడిగింపు, మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం.. ఈ రెండు గ్యారెంటీలు ఈ నెల 9వ తేదీన అమ‌లులోకి తీసుకు రావ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.