మల్కాజిగిరి లోక్‌సభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా..
ఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపి పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లీకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మాల్కాజిగిరి లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఎంపి పదవికి రాజీనామా చేశాను.. ఇది పదవికి మాత్రమే, నా మనసులో మల్కాజిగిరి ప్రజల స్థానం శాశ్వతం. ప్రశ్నించే గొంతుకగా నన్న పార్లమెంట్‌కు పంపిన ఇక్కడి ప్రజలతో నా అనుబంధం శాశ్వతం. చివరి శ్వాస వరకు అటు కొడంగల్.. ఇటు మల్కాజిగిరి నా ఊపిరి అంటూ సిఎం ట్వీట్ చేశారు.