సఫారీలతో తలపడేందుకు టీమ్ ఇండియా షెడ్యూల్

క్రికెట్ (CLiC2NEWS): ఆస్ట్రేలియాపై ఐదు టి-20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ దక్షిణాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమయింది. ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిని చవిచూసిన టీమ్ ఇండియా జట్టు ఆసీస్‌పై 4-1 తేడాతో టి-20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా జట్టుతో భారత్ మూడు టి-20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులలో తలపడనున్నాయి.. బిసిసి మూడు ఫార్మట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించింది. పరిమిత ఓవర్ల సరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నారు. దీంతో పొట్టి సిరీస్‌కు కెప్టెన్‌గా సూర్యకుమార్, వన్డేల్లో కెఎల్ రాహుల్ ఉండనున్నారు. టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడు. ఈ మూడు సిరాస్ల్లో అన్ని మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. డిజిటల్ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్లలో అభిమానులు వీక్షించవచ్చు.
టి20
తొలి టి20 – డిసెంబర్ 10 కింగ్స్ మీడ్ స్టేడియం, డర్బన్ రాత్రి 7.30 గంటలకు
రెండో టి20 డిసెంబర్ 12.. సెయింట్ జార్జ్ పార్క్, కెబెరా రాత్రి 8.30 గంటలకు
మూడవ టి20 డిసెంబర్ 14.. న్యూ వాండరర్స్ స్టేడియం, జొహన్నెస్ బర్గ్ రాత్రి 8.30 గంటలకు
వన్డేలు
మొదటి వన్డే డిసెంబర్ 17.. న్యూ వాండరర్స్ స్టేడియం జొహెన్నెస్ బర్గ్ మధ్యాహ్నం 1.30 గంటలకు
రెండో వన్డే డిసెంబర్ 19.. సెయింట్ జార్జ్ పార్క్, కెబెరా మధ్యాహ్నం 4.30 గంటలకు
మూడ వన్డే డిసెంబర్ 21.. బోలాండ్ పార్క్ పాల్ మధ్యాహ్నం 4.30 గంటలకు
టెస్టులు
తొలి టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 26 నుండి 30 వరకు.. సూపర్ స్పోర్ట్ పార్క్, సెంచురియాన్, మధ్యాహ్నం 1.30 గంటలకు
రెండో టెస్ట్ మ్యాచ్ జనవరి 03 -07 వరకు.. న్యూలాండ్స్, కేప్‌టౌన్ మధ్యాహ్నం 2.00 గంలకు